ఎస్సీ ..ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు కలెక్టర్ లో జిల్లా sc/st విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరియు కర్నూలు జిల్లా ఎస్పీ, పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు కోడుమూరు శాసనసభ సభ్యులు దస్తగిరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మౌంటరింగ్ కమిటీ మెంబర్ ఊట్ల రమేష్ బాబు మాట్లాడుతూ కర్నూలు అంగన్వాడి కేంద్రాలలో ఇస్తున్నటు వంటి ఆహార పదార్థాలలో నాణ్యత లేదు అలాగే కోడి గ్రుడ్లు తక్కువగా వస్తున్నాయి అని చెప్పటం జరిగింది అదేవిధంగా ఎండు ఖర్జూర మరియు చెక్కిలలో నాణ్యత లేదు అని అధికారులకు తెలియ చేయడం జరిగింది. 2. కల్లూరు మండలం ఉలిందకొండ దగ్గర కొల్లంపల్లి తాండ గిరిజనులు నివసించే గ్రామంలో మైనింగ్ పేరుతో ఊరును ఆనుకొని కంకర factory మరియు ఘాతాలు పేలుస్తూ వారి యొక్క నివాస గృహాలను చీలికలకు గురి చేస్తున్న ఆ యొక్క బ్లాస్టింగ్ ని ఆపి తాండ ని రక్షించగలరు.