PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ అధికారుల పై మండిపడ్డ ఎం.పి బస్తిపాటి నాగరాజు

1 min read

సమస్యల పై ఫోన్లు చేస్తే కొంత మంది అధికారులు ఫోన్లు ఎత్తడం లేదు

అధికారులు పద్దతి మార్చుకోవాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రభుత్వ అధికారుల పై కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మండి పడ్డారు.. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో  కోడుమూరు ఎం.ఎల్.ఏ బొగ్గుల దస్తగిరితో కలిసి ఎం.పి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పై అధికారులకు తాను స్వయంగా ఫోన్లు చేస్తే కొంత మంది అధికారులు ఫోన్లు ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అలాంటి అధికారులు పద్ధతి మార్చుకొని పని చేయాలని హెచ్చరించారు.. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. పోలిసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను నిష్పక్షపాతంగా,  పారదర్శకంగా జరపాలన్న ఎం.పి నాగరాజు..  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను  తప్పుదోవ పట్టించే వారిపై దృష్టి పెట్టాలని  పోలీస్ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీ.ఆరో.ఓ చిరంజీవి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author