ఆర్థిక బకాయిలు చెల్లించాలి … ఆపస్ వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండల సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా దిరిసవంచ, తుమ్మగుంట, చింతలపాలెం కనిగిరి లింగారెడ్డి పల్లి, పాతపాడు, కంచర్ల వారి పల్లి పాఠశాలలను సందర్శించడం జరిగింది. పాఠశాలలలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కువగా గత సంవత్సర కాలం గా నిలిచిపోయిన పిఎఫ్, ఏపీ జి ఎల్ ఐ, జి ఐఎస్ సంపాదిత సే సెలవు, తదితర బకాయిలను సత్వరమే చెల్లించే విధంగా, 12వ పిఆర్సి కాలానికి మధ్యంతర భృతి ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్ కోరారు. జిల్లాలో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్ కు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, ఆ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా అధ్యక్షులు కె. మల్లికార్జునరావు జిల్లా విద్యాశాఖ అధికారిని కోరారు. ఈ సందర్భంగా లింగారెడ్డిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు కే.మాధవ్ శర్మ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైన్స్ పాఠాలు బోధించే అంశాన్ని లక్ష మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నందున వారిని ఆపస్ ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆపస్ కనిగిరి మండల బాధ్యులు కె.రవిశంకర్, డివిజనల్ కార్యదర్శి ఏవి నారాయణ, జిల్లా కోశాధికారి , బివిఎస్ గుణ ప్రసాద్ పాల్గొన్నారు.