ఎస్పీ దృష్టికి వాల్మీకి బోయల సమస్యలు…
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : సెప్టెంబరు 22 న కర్నూలు జిల్లా పరిషత్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి బోయల ST అంశంపై రాష్ట్ర స్థాయి చర్చా (వర్క్ షాప్) సమావేశానికి రావాలనీ పిలుపునిస్తూ 15 వ తేది నుంచి 20 వ తేది వరకు నిర్వహించిన వాల్మీకి బోయల విప్లవ బైక్ యాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గం సోమలగూడూరు గ్రామంలో మొదలై మంత్రాలయం నియోజకవర్గం,ఆదోని నియోజకవర్గం,ఆలూరు నియోజకవర్గం,పత్తికొండ,కోడుమూరు నియోజకవర్గ అన్ని గ్రామాల్లో, అన్ని మండాలాలో తిరుగుతూ ఆయా మండలంలో వున్న పోలీసు స్టేషన్లలో CI మరియు SI లను కలిసి మెమారాండం ఇస్తూ వాల్మీకి బోయలపై వున్న అక్రమ కేసులను,రౌడీ షీట్లను, సస్పెక్ట్స్ షీట్లను తీసి వేయాలనీ కోరుతూ బైక్ యాత్రను నిర్వహించడం జరిగింది. చివరి రోజున కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ని కలిసి పై తెలిపిన విధంగా ఆయనకు తెలియపరుస్తూ రౌడీ షీట్లను తీయవేయాలనీ కోరడంమైనది అందుకు ఎస్పీ గ స్పందిస్తూ వయస్సు పైబడిన వారిని మరియు ఏ నేరం లేకుండా కేసులో ఇరుక్కుని పోయిన అతీ చిన్న వయస్సులో వున్న వారిపై,మరియు మంచినడవడిక వున్న రౌడీ షీట్లపై విచారణ చేసి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని ఎస్పీ తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ క్రాంతి నాయుడు, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్, వాల్మీకి సీనియర్ కుంపటి కృష్ణ మరియు వాల్మీకి యువకులు మహేష్ పాల్గొన్నారు.