చంద్రన్న పాలనలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి..
1 min readగ్రామగ్రామాన ఇది మంచి ప్రభుత్వం
రైతుల పక్షపాతి టీడీపీ
పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ. జయనాగేశ్వర రెడ్డి గారు అన్నారు. శనివారం నందవరం మండలం పూలచింత గురురాఘవేంద్ర ప్రాజెక్టు గంగవరం దగ్గర స్విచ్ ఆన్ చేసి పూలచింత చెరువుకు నీరు పారించారు. అలాగే గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గోనెగండ్ల మండలం కులుమాలలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ప్రతి ఇంటికి కొళాయి సదుపాయం కల్పించాలనే బృహత్ సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హర్ ఘర్ జల్ నినాదంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా నిర్మించిన 80 వేల లీటర్ల రక్షిత మంచినీటి సరఫరా పంపును ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పౌరుడు గౌరవంగా జీవించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందించి, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తుందని తెలిపారు. గత వైసీపీ హయాంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి ఏమి జరగలేదని, కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. వృద్ధులకు 4 వేల పెన్షన్ అందించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపారని, మరోవైపు దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్ పథకాలు అన్నిటిని దశలవారీగా నెరవేర్చి తీరుతామని తెలిపారు. వైసీపీ నాయకులకు రేపటితో ఐదేళ్లు పూర్తవుతుందని సూపర్ సిక్స్ పథకాలు చేయలేదని చెబుతున్నారు.. మన ప్రభుత్వం వచ్చి కేవలం 100 రోజులు మాత్రమే అయింది గుర్తు పెట్టుకొని మాట్లాడాలన్నారు. దశలవారీగా ఒక్కొక్కటి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత మా చంద్రన్న తీసుకుంటారని స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వంలో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఏం చేశారు చెప్పాలని గత పాలకులను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మాజీ సీఎం పెట్టారన్నారు. గతంలో తాను రైతుల కొరకు ఎమ్మిగనూరులో ఆర్డీయస్ ప్రాజెక్టును రెండు వేల కోట్లతో మంజూరు చేయించుకుని వస్తే గత వైసిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరిట నాశనం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటారని, ప్రతి రైతుకు సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, నందవరం, గోనెగండ్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.