సామాజిక స్పృహ కలిగిన ఏకైక సంఘం యుటిఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ఉద్యమాలు,పోరాటాలలలో మాత్రమే కాదు సామాజిక స్పృహ లోను కూడా యుటిఎఫ్ అగ్రగామిగా ఉంటుందని యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి,జిల్లా సహాధ్యక్షులు శాంతి ప్రియ,జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్,మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ పేర్కొన్నారు.ఇటీవల కాలంలో విజయవాడలో బుడమేరు ప్రవాహం వల్ల సంభవించిన వరదల కారణంగా తీవ్ర ఆస్తి నష్టం,ప్రాణ నష్టం జరిగిన నేపధ్యంలో సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ సంఘంగా యుటిఎఫ్ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు.విజయవాడలో వచ్చిన వరద బీభత్సం వలన నష్టపోయిన ప్రజానీకానికి ఆర్థిక చేయూతనిచ్చే ఉద్దేశ్యంతో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఏనుగు మర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విరాళాల సేకరణ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు మాత్రమే కాక గతంలో అనగా 2018 లో కేరళలో వరదలు సంభవించినప్పుడు కూడా విద్యార్థుల సహకారంతో 22,000/- రూపాయలు వసూలు చేసి ఆర్థిక సహాయం చేసినట్లు గుర్తు చేశారు అదే విధంగా కరోనా సమయంలో ఉపాధ్యాయుల విరాళాలతో దాదాపుగా ఒక లక్ష రూపాయల వరకు వసూలు చేసి నిరుపేదలకు,పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల అందచేయటం జరిగిందని తెలిపారు.ప్రజాశక్తి దినపత్రిక రిపోర్టర్ శ్రీరాములు అకాల మృతి కారణంగా వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి మండలంలోని ఉపాధ్యాయులు స్పందించి 50,000 వరకు విరాళాలు అందజేశారని పేర్కొన్నారు.సామాజిక స్పృహతో ఎప్పటికప్పుడు సమాజానికి చేయూత అందిస్తూ ముందుకు వెళ్తున్న ఏకైక సంఘం యుటిఎఫ్ అని ఇప్పుడు కూడా విజయవాడ వరద బాధితులకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాటు ప్రజలతో సైతం విరాళాలు సేకరించే కార్యక్రమం ప్రారంభించామని ఇందుకు అందరూ సహకరించాలని వారు కోరారు.కార్యక్రమంలో మండల సహాధ్యక్షులు రమేష్ నాయుడు,జిల్లా కౌన్సిలర్లు బొజ్జన్న,సర్వజ్ఞ మూర్తి,అంజనప్ప,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్,షేక్షావలి,నరసింహయ్య, నెల్లూరప్ప,ప్రసన్న లక్ష్మి,నాగ మద్దయ్య, సాలయ్య,లోకేశ్వరి,ఉమా దేవి,మారతమ్మ,పాల్,రామలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.