జాతీయ రహదారుల భూసేకరణ అంశాలపై జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలో నిర్మితమవుతున్న పలు జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ విషయంపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, ఏలూరు, నూజివీడు ఆర్డివోలతో పాటు జాతీయ రహదారుల ఉన్నతాధికారులు, తహశీల్దార్లు, ట్రాన్స్ కో, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, గనుల శాఖ అధికారులతో భూసేకరణ అంశంపై కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారులు నిర్మాణంకు ఎంతో ప్రాదాన్యతనిస్తున్న దృష్ట్యా జిల్లాలో నిర్మితమవుతున్న పలు జాతీయ రహదారుల భూసేకరణకు సంబంధించి అవరోధాలను అధికమించి పనులు వేగవంతం చేయాలన్నారు. దీనికి సంబంధించి రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, జాతీయ రహదారుల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సందర్బంగా ఎన్ హెచ్ -365, ఎన్ హెచ్ – 165, ఎన్ హెచ్ – 365 బిబి కి సంబంధించి భూసేకరణ అంశాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఎఫ్ఓ రవీంధ్రదామా, డిఆర్ఓ డి. పుష్పమణి, ఆర్డిఓలు ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీశంకరి, ఆర్ అండ్ బి ఎస్ఇ మోషన్ రాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె. బాబ్జి, యం. ముక్కంటి, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజరు వి. ఆదిశేషు, ఎన్ హెచ్ ఉన్నతాధికారులు, పంచాయితీరాజ్, మున్సిపల్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.