శ్రీ బీరప్పస్వామి దేవాలయ నిర్మాణం నకు 1,11,116 వేల రూ.విరాళం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం అద్వర్యం లో పెద్దపాడు సమీపం లోని ఆదర్శ పాఠశాల పక్కన నిర్మాణం లో ఉన్న శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయము నిర్మాణం కోసం కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ కు చెంసా కీ .శే .కురువ లింగారెడ్డి భార్య కుర్వ హనుమంతమ్మ వారి కుమారులు ఎం .కే .రాజశేఖర్ ,ఎం .కే .హరీష్ బాబు ,ఎం .కే .రఘునందన్ లు ఆదివారం ఉదయం రూ .1,11,116=00 ల చెక్ ను కర్నూలు జిల్లా కురువ సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామికి అందజేశారు .ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ దేవాలయ నిర్మాణం ,కమ్యూనిటీ హాల్ ,విద్యార్థుల హాస్టల్ నిర్మాణము నకు దాతలు ముందుకు వచ్చి నిర్మాణం కోసం భూరి విరాళాలు అందజెసి సహకరించవలెనని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు టి .పాలసుంకన్న ,గుడిసె శివన్న ,జిల్లా సహాయ కార్యదర్శి బి .సి .తిరుపాల్ , కొత్తపల్లె దేవేంద్ర ,నగర ఉపాధ్యక్షులు కే .రాజు ,కే .వెంకటేశ్వర్లు ,కే .మద్దిలేటి ,తదితరులు పాల్గొన్నారు .