భగవద్గీత ప్రపంచ సాహిత్యంలో సాటిలేని మేటి గ్రంథం
1 min readమానవులందరికీ భగవద్గీత ఉచిత పుస్తకప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి
తితిదే కార్యక్రమాలను ఇంకా విస్తృత పరచాలి
రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టి.జి.భరత్ పిలుపు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భగవద్గీత సృష్టిలో అత్యంత ఉన్నతమైన గ్రంథమని, మన దేశం గొప్పతనాన్ని నాదేశం భగవద్గీత, నాదేశం అగ్నిపునీత సీత, నాదేశం కరుణాంతరంగ, నాదేశం సంస్కార గంగ, అని ప్రపంచదేశాల్లో ప్రతి భారతీయుడు ఎలుగెత్తి చాటుటకు గర్వకారణమైన గ్రంథం అని, అటువంటి గ్రంథం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు చిన్న వయసులోనే తెలియ జేయవలసిన అవసరం ఎంతో ఉన్నదని రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టి.జి.భరత్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు నగరంలోని ఇండస్ మాంటిస్సోరి విద్యాసంస్థలలో మానవులందరికీ భగవద్గీత పుస్తకావిష్కరణ చేసి విద్యార్థులకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సంస్కారం, సదాచారం కూడా నేర్చుకోవాలని, మాకు విద్యనందించిన ఉపాద్యాయుల ముందు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. మాంటిసోరి ఇండస్ నుండి భాగవత, రామాయణం, భగవద్గీత మొదలైన పోటీల్లో పాల్గొని జాతీయస్థాయిలో విజేతలయిన విద్యార్థులందరికీ మంత్రి అభినందనలతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా విశ్రాంత సర్వోన్నతాధికారి కుమావత రామశంకర నాయక్, జిల్లా విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ పూజారి మోక్షేశ్వరుడు, ఇండస్ మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కె.ఎన్.వి.రాజశేఖర్, బి.యం.మీనాక్షి , పి.విల్సన్ అగస్టీన్, శ్రీనివాసులు రెడ్డి, కామేశ్వరి, మధుసూదన్, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డి.వి.రమణ, ధర్మప్రచార మండలి సభ్యులు ఎద్దుల మహేశ్వర రెడ్డి, మారం నాగరాజు గుప్తా, అవొపా చీఫ్ మలిపెద్ది నాగేశ్వరరావు, పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సంప్రదాయ నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.