పర్యాటక రంగంపై వక్తృత్వ, క్విజ్ పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఈనెల 27వ తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల, పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ, క్విజ్, డ్రాయింగ్/పెయింటింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో విద్యార్థులు విరివిగా పాల్గొనాలన్నారు. పర్యాటకం మరియు శాంతి అనే అంశం వక్తృత్వ పోటీ, ప్రముఖ పర్యాటక ప్రదేశాలపై డ్రాయింగ్ పోటీలు నిర్వహించబడతాయన్నారు. ప్రపంచ, భారత్, ఆంధ్రప్రదేశ్ టూరిజంలపైన క్విజ్ నిర్వహించడంతోపాటు విద్యార్థులు, యువకులకు ఒక నిమిషం నిడివి గల వీడియో, అలాగే జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు పర్యాటకులకు తెలియజేస్తూ ఆకట్టుకొనే 15 నుంచి 20 సెకండ్ల నిడివితో గల రీల్స్, వీడియోలు రూపొందించి సమర్పించాల్సి ఉంటుందన్నారు. వీటిలో ఉత్తమంగా ఎంపిక కాబడిన వాటికి 27వ తారీకున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు . ఈ నెల 26 వ తేదీ నాటికి టూరిజం వీడియో మరియు రీల్స్ సమర్పించవలసి ఉంటుందని జిల్లా పర్యాటక అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 7995087089 మరియు 8297098022 లను సంప్రదించాల్సిందిగా ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.