విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం… కర్నూలు జిల్లా ఎస్పీ
1 min readప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 133 ఫిర్యాదులు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 133 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
హైదరాబాద్ కు చెందిన బెస్ట్ గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ కన్సల్టెంట్ నుండి కాల్ చేస్తున్నామని నాకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి , హైదరాబాద్ అమెజాన్ పార్మాసీ, పార్సల్ సర్వీస్ లో నెలకు రూ. 30 వేలు అని చెప్పి ఉద్యోగంలో చేర్పించారు. కొద్ది రోజులు పార్సిల్ సర్వీస్ లో ఉద్యోగం చేయించుకున్న తర్వాత బోనాల పండగ సెలవులకు ఇంటికి పంపించి, తర్వాత వెళ్ళితే ఉద్యోగం ఏమి లేదని, పని చేయుంచుకున్న రోజులకు డబ్బులు ఇవ్వకుండా కర్నూలు కు తిరిగి పంపించి మోసం చేశారని కర్నూలు , ఉద్యోగనగర్ కు చెందిన చిన్న క్రిష్ణ ఫిర్యాదు చేశారు. షుగర్ ఫిట్ సర్వీస్ కంపెనీ పేరుతో సుజాత, వైభవ్ లు నాకు ఫోన్ చేశారు. షుగర్ వ్యాధి ఉన్న వారికి ట్లాబెట్స్ లేకుండా ఆన్ లైన్ లోనే మా డాక్టర్స్ సంప్రదిస్తారని, నెలకు రూ. 2,500 ఫీజు, ప్రోడక్ట్స్ ఇస్తారని , ఆరోగ్యంగా ఎలా ఉండాలని షుగర్ ఫిట్ ఆఫీసు నుండి సర్వీసెస్ తెలియజేస్తారని , బ్యాంక్ ఖాతా, ఫోటో, పాన్ కార్డు తీసుకొని నాకు తెలియకుండానే నా యొక్క బజాజ్ ఫైనాన్స్ కార్డు నుండి రూ. 30 వేలు కాజేశారని కర్నూలు కు చెందిన పరమేష్ ఫిర్యాదు చేశారు. ఆయిల్ మరకలను తుడవడానికి, క్లాత్స్ సప్లయ్ చేయడానికి రైల్వే టెండర్ ఇప్పిస్తామని చెప్పి కర్నూలు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ కు చెందిన శ్రీనివాసులు రూ. 16 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు , కల్లూరు చెందిన సుంకన్న ఫిర్యాదు చేశారు. కర్నూలు దిన్నేదేవరపాడు లక్ష్మీ వెంకటేశ్వర వెంచర్స్ లో రూ. 35 లక్షలకు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఇంత వరకు ఇల్లు కట్టించకుండా మోసం చేశారని కోడుమూరు కు చెందిన అరుణ ఫిర్యాదు చేశారు. నా పొలంలోనికి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా ప్రవేశించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, నా పొలంలోనికి వెళ్ళనివ్వకుండా కంపౌడ్ వాల్ వేశాడని చర్యలు తీసుకోవాలని వెల్దుర్తి, వెంకటాపురం కు చెందిన పుల్లయ్య ఫిర్యాదు చేశారు.ఆంధ్ర మరియు తెలంగాణ బార్డర్ సమీపంలో మద్యం దుకాణం కు టెండర్ ఇప్పిస్తామని చెప్పి బుధవారపేటకు చెందిన షేక్ సలీమా బేగం, షేక్ మహబూబ్ భాషా , శివ కుమర్ రావులు రూ. 98 లక్షలు తీసుకొని మోసం చేశారని కర్నూలు , సంతోష్ నగర్ కు చెందిన హరికృష్ణ ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐ శివశంకర్ పాల్గొన్నారు.