వరి ధాన్యాన్ని బియంగా మార్చే రైస్ మిల్లర్ ల పై అవగాహన
1 min readఒకేషనల్ ట్రైనర్ రజాక్ నేతృత్వంలో విద్యార్థులకు ఆవశ్యకత
హై స్కూల్ స్థాయినుండే విద్యార్థులకు పారిశ్రామిక రంగంపై తీర్చిదిద్దే యోచన
ప్రిన్సిపల్ ఎస్ ఎల్ ఎన్ వి జి శర్మ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు మండలం కొవ్వలి ఎస్ వి ఎస్ ఆర్ బి జిల్లాపరిషత్ హైస్కూలు ప్లస్ ప్రిన్సిపాల్ ఎస్ ఎల్ ఎన్ వి జి శర్మ వరి పంట సాగు పైన వరి ధాన్యాన్ని బియ్యంగా మార్చే రైస్ మిల్లర్ ల పై అవగాహన కల్పించేందుకు విద్యార్థులను పంట పొలాలకు తీసుకువెళ్లారు,పంట కాలం.పూర్తయ్యాక పంటను వరికోత యంత్రాల సహాయం తో కోసి ధాన్యాన్ని వేరు చేసి ధాన్యం లో తేమశాతం తగ్గేవరకు కల్లాల పై ఆరబెట్టే విధానాన్ని విద్యార్థులకు వ్యవసాయ రంగం లో అనుభవజ్ఞులైన ఓకేషనల్ ట్రైనర్, రజాక్ నేతృత్వం లో వరిపంటల సాగు తో బాటు రైస్ మిల్లుల ఆవశ్యకత రైస్ మిల్లుల పని తీరును వివరిస్తూ విద్యార్థులతో కలిసి రైస్ మిల్లుల సందర్శన చేశారు. మరియు సునీల్ ఆటోమొబైల్స్ రంగం గురించి అవగహన కల్పించారు. రానున్న కాలంలో విద్యార్థులను వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను కూడా విద్య లో మెర్జి చేసి హైస్కూల్ స్థాయి నుండే విద్యార్థులను మంచి పారిశ్రామిక వ్యవసాయకులుగా ప్రభుత్వంతీర్చి దిద్ధనుంది.