రైతులను ఆర్థికంగా బలోపేతం చేయటమె పొలం పిలుస్తుంది కార్యక్రమ లక్ష్యం
1 min readదెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పాల్గొన్న రైతులు,వ్యవసాయ అధికారులు,కూటమి నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదవేగి మండలం దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి “పొలం పిలుస్తుంది” కార్యక్రమ పోస్టర్ ను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సోమవారం ఆవిష్కరించారు. సాగులో సాంకేతిక మెళకువలు నేర్పి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయటమె లక్ష్యంగా “పొలం పిలుస్తుంది” కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించటం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ రంగంలో రైతులకు అవసరమైన మరింత అవగాహన, నైపుణ్యము, కొత్త పద్ధతులను వారి అక్షరాస్యత స్థాయిలకు అనుగుణంగా సులభంగా అర్థమయ్యే రీతిలో అందజేస్తూ, పంట ఉత్పత్తిలో అత్యాధునిక సాంకేతికతలు వ్యాప్తి చేయడం ద్వారా, సాగు వ్యయాన్ని తగ్గించడం, మెరుగైన సాగు పద్ధతులను అవలంబించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఉత్పాదకతను పెంచడంతో పాటు రైతుల ఆదాయ స్థాయిలను పెంచడమే లక్ష్యంగా “పొలం పిలుస్తుంది” అనే కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఖరీఫ్ లో 4 నెలలు, రబీ లో 4నెలలు పాటు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రభాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, బొప్పన సుధా, లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు వై.సుబ్బారావు, వ్యవసాయ శాఖ అధికారులు ముత్యాల ప్రియాంక, జీవన సంధ్య, ప్రదీప్ కుమార్ సహా పలువురు కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.