PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యతో పాటు..క్రీడలూ అంతే ముఖ్యం

1 min read

విద్యార్థులతో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా  ప్రభుత్వ పాఠశాలలు

నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విద్యతో పాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. సోమవారం ఉదయం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ఆటల పోటీలను ఎమ్మెల్యే జయసూర్య,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,గ్రామ సర్పంచ్ మాధవరం సుశీలమ్మ, ఎంఈఓ సుభాన్ రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు.తర్వాత విద్యార్థులతో పాటు ఎమ్మెల్యే  కబడ్డీలో ఆడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో విద్యార్థులు ఎక్కువగా మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు కానీ గత పది సంవత్సరాల్లో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో క్రీడలు కనుమరుగై పోయాయని  ఆటల పోటీల పట్ల విద్యార్థులు శ్రద్ధ కనబరచాలని అన్నారు.విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను ఎంతో పవిత్రంగా చూస్తూ ఉన్నారని సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్ళు అనే ధ్యేయంతో నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారన్నారు.పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో వాటిని సహించే ప్రసక్తే లేదని భోజనంతో పాటు విద్య విద్యతో పాటు క్రీడలు విద్యార్థులకు ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు క్రీడలు చేస్తే విద్యార్థుల జీవితాలు ధన్యం అవుతాయని ఎమ్మెల్యే అన్నారు.విద్యార్థులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తర్వాత ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పాఠశాలల ఉపాధ్యాయులు అందజేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,ఎంపీటీసీ తిప్పారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు పెరుమాళ్ళ శ్రీనాథ్,స్వామిదాసు రవికుమార్,పాఠశాల చైర్మన్ రషీద్ భాష మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author