రాష్ట్రస్థాయి ఇన్ఫర్టిలిటి సదస్సులో కేఎంసి గైనిక్ విభాగం ప్రతిభ”
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇన్ ఫర్టిలిటీ అంశంపై ఐ.ఎ.ఎస్ ఆర్. ఆధ్వర్యంలో నగరంలోని మౌర్య ఇన్ హోటల్ యందు జరిగిన రెండు రోజులు సదస్సులో కర్నూల్ మెడికల్ కాలేజీ గైనిక్ విభాగానికి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు పీజీలకు పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో మొత్తం నలుగురికి బహుమతులు రావడం జరిగింది. ప్రిన్సిపాల్ ని కలిసిన గైనిక్ విభాగపు వైద్యులతో కర్నూల్ మెడికల్ కాలేజి గైనిక్ విభాగానికి చెందిన నలుగురు ప్రతిభ కనపరచటం పట్ల అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమ లో గైనిక్ విభాగపు అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ లక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. సుప్రియ, డా.ప్రియ క, పీజీలు షారున్, మనీషా, తదితరులు పాల్గొన్నారు.