మండలంలో భారీ వర్షం – పెన్నా నదిలో పెరుగుతున్న నీటి ప్రభావం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోరణి కారణంగా చెన్నూరు మండలం వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 6.30.గంటల వరకు భారీ వర్షం కురిసింది. గత ఐదు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతల పెరిగిపోవడం ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్న సమయంలో భారీ వర్షం ప్రజలకు ఊరట నిచ్చింది. భారీ వర్షంతో చెన్నూరులో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. చెన్నూరు కొత్త రోడ్డు భవాని నగర్ పలు ప్రాంతాల్లో రోడ్లలో వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మండల వ్యాప్తంగా భారీ వర్షం49.4. మిల్లీమీటర్లు నమోదైనట్లు మండల తాసిల్దార్. జీవన్ చంద్రశేఖర్ తెలిపారు. పెన్నా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండడంతో కుందు ఇతర నదులు వంకలు నుంచి వస్తున్న వరద నీరు పెన్నా నదిలోకి చేరుతున్నది. సోమవారం సాయంత్రానికి చెన్నూరు వద్ద 13 వేల క్యూసెక్కులు వరద నీరు పెన్నా నది లో ప్రవహిస్తూ దిగువ ఉన్న సోమశిల ప్రాజెక్టులోకి చేరుతున్నది. శ్రీశైలం జలాశయం నుంచి కుందూ నది ద్వారా వదులుతున్న వరద నీరు క్రమిపి తగ్గుముఖం పడుతున్నది.30 వేల క్యూసెక్కులు వరద నీరు పెన్నా నదిలో ప్రవహించేది. ప్రస్తుతం పెన్నా నదిలో 11 వేలు క్యూసెక్కులు మాత్రమే ప్రవహిస్తున్నది. భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలోకి వర్షం నీరు చేరడంతో ప్రస్తుతం 2 వేలు క్యూసెక్కుల నీరు పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరిగింది.