తూ తూ మంత్రంగా మధ్యాహ్నం భోజనం తనిఖీ.. ఏఐఎస్ఎఫ్
1 min readఎంఈఓ తో వాగ్వాదం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలోని బాలుర గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం భోజనాన్ని మండల విద్యాధికారి తూ..తూ… మంత్రంగా తనిఖీ చేశారని ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు వినోద్ విమర్శించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనం మెనూ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా అందించడం వలన అర్ధాకలితో విద్యార్థులు కడుపులు మాడ్చుకుంటున్నారని,ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం భోజనం మెనులో భాగంగా ఒక్కో విద్యార్థికి 85 గ్రాముల చికెన్ ఇవ్వాల్సి ఉండగా అంతంత మాత్రమే చికెన్ కర్రీ విద్యార్థులకు వడ్డించగా, అక్కడే ఉన్న ఎంఈఓ ప్రశ్నించాల్సింది పోయి చూసి చూడనట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని, లేని యెడల విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి కిరణ్, శ్రీ చరణ్, రవికుమార్, చంద్ర, కేశవ తదితరులు పాల్గొన్నారు.