PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి : సర్పంచ్

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: క్రీడాకారులు ఆటల పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని దామగంట్ల సర్పంచ్ మాధవరం సుశీలమ్మ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో రెండవ రోజున మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాల బాలికల మీట్ జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మాధవరం సుశీలమ్మ అలాగే షీల్డ్స్ దాత డాక్టర్ డాలు చంద్ర శేఖర్,పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ రషీద్ భాష హాజరయ్యారు. ముందుగా సర్పంచ్ సుశీలమ్మ వాలీబాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచాలంటూ క్రీడాకారులను ఆమె ప్రోత్సహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని చెప్పారు.ఈ క్రీడలకు నందికొట్కూర్ మండల పరిధిలోని అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల నుండి బాల బాలికల విభాగంలో దాదాపు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వాలీబాల్,ఖో-ఖో,కబడ్డీ క్రీడలలో బాల బాలికల విభాగంలో హోరాహోరీగా జరిగాయి.అనంతరం క్రీడల్లో గెలుపొందిన జట్లకు అతిధుల చేత షీల్డ్లు మరియు మెడల్స్ బహూకరించబడ్డాయి.ఇక్కడ సెలెక్ట్ కాబడిన క్రీడాకారులు మండల జట్టుగా ఏర్పడి నందికొట్కూరు నియోజకవర్గ స్థాయిలో సెప్టెంబర్ 30 మరియు అక్టోబర్ 01వ తేదీలలో నందికొట్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  జరిగే క్రీడల్లో పాల్గొంటారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత జీవన్,జీవన్,మండల ఎస్ జిఎఫ్ కోఆర్డినేటర్ వీరన్న,మీట్ ఆర్గనైజర్ సుంకన్న,సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనాథ్ పెరుమాళ్ళ, స్వామి దాసు రవికుమార్, రామకృష్ణ,డోరతి,పద్మలత జసింత, విజయకుమారి,రాజేశ్వరి, సరస్వతి,డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ జూడో కోచ్ శాంతరాజు,సుబ్బన్న, సుంకన్న,గోకారి, రాఘవేంద్ర, సుబ్బయ్య,ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author