PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుడ్డాయ పల్లె లో డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలము లోని  బుడ్డాయ పల్లె గ్రామంలోని గ్రామ దేవత గాలమ్మ గుడి నుంచి గోపవరం వెళ్లే దారిలో 15 అడుగుల మేర డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేసి రోడ్డుపై వర్షం నీరు నిలవకుండా చూడాలని స్థానిక బుడ్డాయ పల్లె ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని ఈ డ్రైనేజీ కాలువ నిర్మించాలని వారు తెలియజేస్తున్నారు. ఈ రహదారిలో గత ప్రభుత్వంలో సిమెంట్ రోడ్డు నిర్మించారు. కానీ ఈ రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉండడంతో వర్షపు నీరు నిలిచి రోడ్డుపై ఉన్న మట్టితో కలిసి పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ రహదారి గుండా 15 అడుగుల మేర డ్రైనేజీ కాలువ లేకపోవడంతో వర్షం నీటితో రోడ్డు అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు.ఈ రహదారి గుండా మండలంలోని ఉప్పరపల్లి ,గోపవరం ,పుష్పగిరి, శివాల పల్లి, గ్రామాలకు ప్రయాణం చేస్తుంటారు. రోడ్డు అస్తవ్యస్తంగా మారి ప్రజలకు అసౌకర్యంగా మారింది .గ్రామంలో ఏర్పాటైన ప్రధాన డ్రైనేజీ కాలువకు ఈ 15 అడుగుల డ్రైనేజీ కాలువను అనుసంధానం చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ విషయంపై గత ప్రభుత్వంలో ప్రజలు పలుమార్లు మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది .అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు మౌలిక వసతులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మండల అధికారులు ప్రజాప్రతినిధులు తగు విధంగా స్పందించి డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

About Author