రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండాలి
1 min readమండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయ అధికారి కె. శ్రీదేవి అన్నారు.మంగళవారం మండలం లోని రాచినాయపల్లి రామనపల్లి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులుతో కలసి ఆయా గ్రామాలలో పంటల సాగు అలాగే తెగుళ్లు వాటి నివారణ పై రైతులతో చర్చించడం జరిగినది. అదేవిధంగా ఆమె రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం. అలాగే ఉద్యాన శాఖ, పశువైద్య శాఖ, డ్రిప్పు స్ప్రింక్లర్ల పథకాలు పై అవగాహన కల్పించడం తో పాటు, తక్కువ పెట్టుబడి అధిక ఉత్పత్తి ఎక్కువ నికరాదాయం దిశగా ప్రోత్సహించడం వంటి అంశాలపై రైతులకు వివరించడం జరిగినది. అంతేకాకుండా వ్యవసాయ శాఖ అధికారిని ప్రొద్దుతిరుగుడు విత్తనాలు ఎన్.డి. ఎస్ హెచ్ 1012 (చిన్న సముదాయాలు) ఉచితంగా అందుబాటులో ఉన్నాయని రైతులకు తెలియజేయడం జరిగినది. అదేవిధంగా జీవ నియంత్రణ, శిలీంద్ర కారకా లైన ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వంటివి పిచికారి చేసుకొని తెగుళ్ల నివారణకు ఉపయోగించుకోవాలని రైతులకు తెలియజేయడం జరిగినది. అలాగే వరిలో ఆకు ముడత పురుగును గుర్తించి వేప నూనెను పిచకాలి చేసి గుడ్డు దశలోనే పురుగు నివారణ చేయాలని ఆమె రైతులకు సూచించారు. ఉద్యాన శాఖ అధికారి జ్యోతిర్మయి మాట్లాడుతూ, బొప్పాయి సాగు చేసుకున్న రైతులకు రాయితీ ఇవ్వడం జరుగుతుందని, డ్రిపు వేసుకొని మల్చింగ్ వేసుకున్నట్లయితే వారికి రాయితీ వర్తిస్తుందని ఆమెతెలియజేశారు. పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ యరపు రెడ్డి మాట్లాడుతూ, ఉపాధి హామీలో మినీ గోకులాలు 90% రాయితీ తో అందుబాటులో ఉన్నాయని పశువులకు గాలికుంట టీకాలు వేయించుకోవాలని, రైతులకు తెలియజేయడం జరిగినది. మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, బోర్లు ఉన్న రైతులు డ్రిప్పు స్ప్రింగ్ కలర్లు రాయితీ మీద పెట్టుకోవచ్చని రైతులకు తెలియజేశారు. డ్రిప్పు 5 ఎకరాలు లోపు ఉన్న రైతులకు 90% సబ్సిడీ 5 కన్నా ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు 70 శాతం సబ్సిడీ, స్ప్రింక్లర్లు 50% రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. కావలసిన రైతులు ఆర్ఎస్కే పరిధిలో గ్రామ వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకులను కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఏపీ సీఎన్ ఎఫ్ ప్రకృతి వ్యవసాయం L 2 కే.వెంకటయ్య మాట్లాడుతూ, జీవామృతం తయారీ విధానం దాని ఉపయోగాలు గురించి రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు యు. సునీల్ ,పూజిత, రమణమ్మ, రైతులు పాల్గొన్నారు.