విద్యార్థులకు సరైన సమయానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చెయ్యాలి
1 min readపిడిఎస్ఓ. డిమాండ్..
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఆదోని పట్టణంలో విద్యార్థులకు సరైన సమయానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో నందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన సెక్రెటరీ శివ మాట్లాడుతూ…..ఆదోని నుండి పత్తికొండ వెళ్లే బస్సు, మరియు అలాగే ఆదోని నుండి దొడ్డనగేరి ఆయా గ్రామాలకు వెళ్లాల్సిన బస్సు విద్యార్థులకు సరైన సమయానికి రాక విద్యార్థులు చదువులకి దూరం అవుతున్న పరిస్థితి కనపడుతున్నది. పొద్దున కళాశాలకు వెళ్లాలన్న రెండు మూడు క్లాసులు జరిగిపోతున్నాయి సాయంకాలం ఇంటికి వెళ్లాలన్న దాదాపుగా రాత్రి 8 గంటలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. మరి దీనివలన చదువుతున్న ఆడపిల్లలకు ఈ యొక్క ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ప్రతినెల బస్సు పాసులు కడితే వాళ్లకి తగిన న్యాయం జరగడం లేదని చెప్పేసి విద్యార్థులు ఆందోళన పద్ధతిలో ధర్నా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమ సందర్భంగా ప్రత్యేకంగా ఆర్టీసీ అధికారులు కోరడమేమిటంటే పల్లె పల్లెకి బస్సు అన్న మీరు ఇప్పుడు సరైన సమయానికి బస్సు నడపక విద్యార్థులకు చాలా ఇబ్బందీ పెడుతున్నారు కావున ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థగా అధికారులు కోరడమైనది. ఈ యొక్క విద్యార్థి ఉద్యమానికి అధికారుల సహకరించి తప్పనిసరిగా మీకు బస్సు మీకు తగిన సమయానికి ఏర్పాటు చేస్తామని ఆర్టిసి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది .లేనియెడల ఆర్టీసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని,ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రాజు, కేశవ ,గోవిందు, తిరుమల, గౌస్ ,భాష మరియు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.