ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ను అరెస్ట్ చేయాలి – అబ్బూరి అనిల్
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఉండి నియోజకవర్గం ఏలేరు పాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీలు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీ ని తొలగించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బూరి అనిల్ బాబు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద సోమవారం నాడు వివిధ ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో యువకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఒక వీధి రౌడీలా ఎమ్మెల్యే ఎస్సీలపై విరుచుకుపడ్డారని, ఆయనే స్వయంగా ఫ్లెక్సీలు తొలగించారని, ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. మాల జాతియోధుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. కలెక్టర్కు మెమొరండం అందజేశారు. ఈ ధర్నాలో మెండెం సంతోష్ కుమార్,అబూరి అనిల్,సొంగ మధు,నూకపేయి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.