ఘనంగా పోషకాహార వారోత్సవాలు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని వెలుగు మహిళా మండల సమైక్య భవనంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ సీడీపీఓ కోటేశ్వరమ్మ హాజరయ్యారు. మండల సూపర్ వైజర్లు అయిన వరలక్ష్మి మరియు రేణుకాదేవి అధ్యక్షతన పౌష్టికాహార మాసోత్సవాలు సందర్భంగా పోషణా అభివృద్ధి కి తోడ్పడే ఆహార పదార్థాలు,ఆకుకూరలు,రకరకాల పిండి వంటల తో,మిల్లెట్స్ ఉపయోగించి చేసే వంటకాలను స్టాలు లాగా ప్రదర్శిసిస్తూ వాటి ప్రాముఖ్యత తెలియచేస్తూ… మహిళ లలో గురించి కిషోర బాలికలలో రక్త హీనతను ఎలా నివారించాలనే పలు గర్భినీ స్త్రీలకు సిడిపిఓ కోటేశ్వరమ్మ అవగాహన కల్పించారు. తర్వాత గర్భిణిస్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం మరియు పసిపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు వేడుకగా జరిగాయి.ఈ కార్యక్రమంలో మండల అధికారులు అయిన ఎంపీడీఓ ,మండల విద్యా శాఖ అధికారి శ్రీనాధ్,హెల్త్ సూపర్వైజర్ ఏసేపు, మహిళలు గర్భవతులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.