మున్సిపాలిటీలో 8 కోట్ల అవినీతిని వెలికితీయాలి
1 min readవిచారణ చేపట్టాలి ప్రజా ప్రతినిధులు అవినీతి చేయడం సిగ్గుచేటు:సీపీఎం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో జరిగిన 8 కోట్ల అవినీతిపై తక్షణమే విచారణ చేపట్టి వాటిలో ఎవరు ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరరావు,పక్కిర్ సాహెబ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు తీర్మానాలు చేసుకుంటున్నారని ప్రజా సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. నూతన మున్సిపల్ కార్యాలయం పేరుతో మూడు కిలోమీటర్లు దూరం కొత్త కార్యాలయం నిర్మాణాన్ని వారు తప్పు పట్టారు.ఈ కార్యాలయానికి 9 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని అందులో కేవలం భూమి పూజకు మాత్రమే ఎనిమిది కోట్లు ఖర్చు చేశారా అని కౌన్సిల్ సమావేశంలో చర్చకు పెట్టడం శోచనీయమన్నారు.ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి అవినీతికి పడడం సిగ్గుచేటు.ఐదు నెలలుగా కోటి 35 లక్షల విద్యుత్ బకాయి ఉన్నాయని చైర్మన్ సాక్షిగా మున్సిపల్ కమిషనర్ బేబీ సమావేశంలోనే చెప్పారని ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశంలో ఒకరికి ఒకరు దూషించుకొని బయటకు వెళ్లిపోవడం సరిపోతుందని ఇది మున్సిపాలిటీలో జరిగే అవినీతి బయట పడుతుందని గొడవలు చేసుకొని అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోవడం సరికాదన్నారు. మున్సిపాలిటీలో కార్మికుల పేరుతో ప్రజా ప్రతినిధుల అనుచరుల పేర్లను చేర్పించి డబ్బును విచ్చలవిడిగా వాడుకున్నారని ఇప్పటికైనా ఈ అవినీతిపై సిబిఐ విచారణ చేసి నిజా నిజాలు మున్సిపాలిటీ అవినీతిని బయటకు తీయాలని లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో సిఐటియు రూరల్ కార్యదర్శి సి నాగన్న, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు డి బాబు తదితరులు పాల్గొన్నారు.