ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే విరుపాక్షి విజ్ఞప్తి …
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పర్యటన చేయబోతున్నారు. ఆయన జిల్లా పర్యటనలో జిల్లా రైతాంగానికి స్పష్టమైన మెసేజ్ ఇవ్వాలని కోరుతున్నాము.ఎందుకంటే వేదవతి, నగరడోన, హంద్రీనీవా కాలువకు తూము ఏర్పాటు చేసి పక్షిమ ప్రాంత రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం లో రోడ్లు డ్రైనేజీ తాగునీటి సమస్య అధికంగా ఉంది నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష లేకుండా ఆలూరు నియోజకవర్గం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాను . కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన పథకం అవ్వ తాత లకు పెన్షన్ పథకం. అది కూడా చంద్రబాబు నేల నెల పెన్షన్లుపంపిణీ ముఖ్యమంత్రి హోదాలో నేను తప్ప ఎవరు ఇవ్వడం లేదు అనట్లు ఫొటో పోజుకు తప్ప ఏమీ లేదు. ముఖ్యమంత్రప్రజా సమస్యలపై , గ్రామాల అభివృద్ధి పై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.అధిక వర్షాలు తో అక్కడ అక్కడ రైతులు సాగుచేసుకున్న పంట పొలాలు నష్టపోయారు. నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాము . పత్తికొండ రెవిన్యూ డివిజన్ పరిధిలో ఎక్కువ శాతం టమోటా పంట సాగుచేసుకుంటున్నారు.కొన్ని సందర్భాల్లో పంట దిగుబడి వచ్చినప్పుడు గిట్టుబాటు ధర ఉండదు.కావున ప్రభుత్వం టమోటా జ్యుష్ ఫ్యాక్టరీ ఆస్పరి లో ఏర్పాటు పై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నాము నేను ఆలూరు ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై మీకు ఈ లేఖలో ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన విషయాలు అన్ని పొందుపరిచాము కావున ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని అభివృద్ధికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారని నేను ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తున్నాను.