పండ్ల తోటల పెంపకంలో సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించాలి
1 min readసే ట్రీస్ సంస్థ టెక్నికల్ మేనేజర్ రైతులకు సూచన
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పండ్ల తోటల పెంపకం లో సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించాలని సే ట్రీస్ సంస్థ టెక్నికల్ మేనేజరు రాహుల్ రైతులకు సూచించారు. సోమవారం పత్తికొండలోని నవ యూత్ అసోసియేషన్ కార్యాలయంలో ఉద్యానవన రైతులకు పండ్ల మొక్కల పెంపకం మరియు సమగ్ర సస్యరక్షణ పై శిక్షణ కార్యక్రమం సే ట్రీస్ మరియు నవ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పండ్ల తోటల రైతులకు పలు సూచనలు చేశారు. పండ్ల మొక్కల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. మొక్కల పెరుగుదలలో ఎదురయ్యే సమస్యలు మరియు వాటిని ఏ విధంగా నిర్మూలించుకోవచ్చు అనే అంశాలపై దృశ్య మాలికతో చూపించి అర్థమయ్యే రీతిలో రైతులకు వివరించారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో చిని, మామిడి కి సంబంధించిన ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్స్ ను సందర్శించి రైతులకు ప్రదర్శించారు. పండ్ల మొక్కల పెంపకం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని నవ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సే ట్రీస్ ప్రోగ్రామ్ మేనేజర్ బి నారాయణ, నవ యూత్ అసోసియేషన్ సీఈఓ లు నరసింహులు, చిన్న మునిస్వామి, సే ట్రీస్ సిబ్బంది సుధాకర్ , అశోక్ మరియు రైతులు పాల్గొన్నారు.