PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేద విద్యార్థులకు అండగా ఏలూరు జిల్లా ఎస్పీ

1 min read

శ్రీ సత్య సాయి సేవా సంఘం 15 వేల నగదు,10 వేలతో భోజన సదుపాయం ఏర్పాటు

శ్రీ సత్యసాయి సేవా సంఘం సేవలు అభినందనీయం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన  పసుపులేటి.పుల్లారావు, భార్య కృష్ణవేణి వారికి ఇద్దరు ఆడ పిల్లలు భువనేశ్వరి, గీతాంజలి పేదరికంతో ఉండటం వల్ల చదువుకి ఇబ్బంది అవుతుందని, ఎవ్వరైనా చదివిస్తే, చదువుకొని వారి తల్లి దండ్రులను బాగా చూసుకోవాలని అనుకుంటున్నాము అని విద్యార్థి రాసిన లేఖకు స్పందించిన ఏలూరు  జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆ ఇద్దరి ఆడపిల్లలకు చదువు నిమిత్తం ఏదైనా సహాయం చేయాలని ఉద్దేశంతో ఏలూరు జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంఘం వారికి సదరు సమాచారాన్ని అందించి వారికి సహాయపడాలని కోరారు.సోమవారం  ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా శ్రీ సత్యసాయి సేవా సంఘం ప్రతినిధులు భువనేశ్వరి, గీతాంజలి లకు వారి యొక్క చదువులు నిమిత్తం 15 వేల రూపాయలను మరియు 10 వేల రూపాయల ఖరీదు చేసే ఆహార పదార్థాలను జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందించినారు మరియు ప్రతి నెల వారికి అమృత కలశం ద్వారా వారికి నెలకు సరిపడే ఆహార పదార్థాలను అంద చేస్తామని ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంఘం ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ సత్యసాయి సేవా సంఘం వారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే వెంటనే వారి సేవా సంస్థ ద్వారా సహాయాన్ని అందించి ఇబ్బందుల్లో ఉన్న వారికి తోడ్పటును అందిస్తున్నరని, గతంలో విజయవాడ వరదల సమయంలో కూడా వారు విశేష కృషి చేశారని వారి యొక్క సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఏలూరు డిఎస్పి డి. శ్రావణ్ కుమార్, ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ , కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ వి.రవికుమార్, భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్ , ఏలూరు శ్రీ సత్య సాయి సమితి ప్రతినిధులు కె.శశి శేఖర్, పి. రామారావు, కె. వెంకటేశ్వరరావు, శాంత కుమార్ మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

About Author