NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గో సంరక్షణతో సమస్త సంపదలు

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.

గోపూజతో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  గోసంరక్షణతో ప్రకృతి సంరక్షణ జరుగుతుందని, ప్రకృతి సంరక్షణతో సర్వ జీవరాశి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని, అందుకొరకు గోసంరక్షణ ఒక వ్రతంగా స్వీకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కన్నుల శాఖ ఆధ్వర్యంలో హాలహర్వి మండలం, బాపురం గ్రామంలోని శ్రీ రామాలయం నందు గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. గత మూడు రోజులు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై సుంకన్న స్వామి చేసిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో  సర్పంచ్  భాగ్యమ్మ, టిడిపి నాయకులు ఎంపీటీసీ సభ్యులు ప్రహ్లాద రెడ్డి, సుధాకర్, గ్రామ పెద్దలు నాగన్న గౌడ్, వీరభద్ర గౌడ్, పురోహితులు బసవరాజు స్వామి, ప్రభుత్వ ఉపాద్యాయులు పి బసవరాజు, పార్థన్న, నాగరాజుతో పాటు పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు పాల్గొన్నారు.

About Author