ఎ పి జె ఎ సి రాష్ట్ర కార్యదర్శి కాకీ ప్రకాష్ రావు కు సన్మానం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గత శనివారం నాడు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు యెుక్క ఆంధ్ర ప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎ పి జె ఎ సి) రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నిక ఐన కాకి ప్రకాష్ రావు ను కర్నూలు మండలము వసంత నగర్ ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల సిబ్బంది ఘనంగా శాలువా మరియు పూల మాలతో సన్మానం చేశారు.ఈ సందర్బంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రకాష్ రావు విద్యార్థి సంఘం నేత గా, యువజన రాజకీయ నాయకుడి గా అందరికీ సుపరిచితులు.ఉపాద్యాయ ఉద్యోగం లో చేరిన తరువాత ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ సంఘం లో మండల స్థాయి నుండి రాష్ర్ట స్థాయి ప్రధాన కార్యదర్శి స్థాయి కి ఎదగడం జరిగింది. ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన్ గా మరియు కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇన్చార్జి గా గత ప్రభుత్వ కాలం లో జరిగిన అనేక ఉద్యమాలు యందు చురుకు ఐన భూమిక ను నిర్వహించారు.దానికి నిదర్శనం గా జిల్లా లో పోలిసులు అనేక మార్లు ఆయనను నిర్బంధించిన విషయం అందరికీ తెలిసినదే. ప్రస్తుతం ఉపాద్యాయ మరియు ఉద్యోగుల ఎ పి జె ఎ సి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక అయినందున మన పాఠశాల సిబ్బంది కి గర్వ కారణము అని అన్నారు.ఎస్ సి ఎస్ టి ఉపాద్యాయ రాష్ట్ర నాయకుడు సుబ్బారాయుడు గారు మాట్లాడుతూ ప్రకాష్ రావు చాలా చిన్న వయస్సు లోనే రాష్ట్ర నాయకుడు గా ఎదిగాడు, సమస్య ల పై అవగాహన వాటినీ సాధించడం లో పట్టుదల గల నాయకుడుగా ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) ను రాష్త్రం అంతా విస్తరింప చేశాడు అని అన్నారు.వ్యాయమ ఉపాద్యాయ సంఘం జిల్లా నాయకుడు పుల్లన్న మాట్లాడుతూ అందరకీ పిలిస్తే పలికే నాయకుడు కాబట్టే నేడూ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నిక అయ్యారు అన్నారు.సన్మాన గ్రహీత ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ ఆప్టా సంఘం నాయకుల పై నమ్మకం పెట్టిన వారికి న్యాయం చేయటానికి ఎంత దూరం ఐన వెళ్ళడం ఆప్టా నాయకులకు అలవాటు అందు వలన ఆప్టా సంఘం నేడు రాష్ట్రం అంతటా వేగంగా అభివృద్ది చెందుతుంది. కాబట్టే ఆప్టా సంఘం నకు ఉపాధ్యయ మరియు ఉద్యోగ సంఘాల యందు ఆప్టా ప్రాధాన్యత పెరుగుతుంది అని అన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో వసంత నగర్ ప్రాథమిక పాఠశాల సిబ్బంది మరియు ఉన్నత పాఠశాల సిబ్బంది వెంకట రమణ గుప్త,ప్రసాద్, మనోహర్, శ్రీనాథ్ మస్తాన్ వలి, దత్తాత్రేయ,పద్మావతి, లత, తెలుగు పద్మావతి , భారతి, ప్రేమలత, వెంకట లక్ష్మీ మరియు విద్యార్దులు పాల్గొన్నారు.