PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు  : సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే వారి జీవితాల్లో ఆనందం నింపడానికే ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ప్రతి నెల ఒకటవ తేదీన తెల్లవారక ముందే వారి ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ముండ్ల నరసింహారెడ్డి, నరసింహ ఆచారి లు అన్నారు. మంగళవారం వారు ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ సిబ్బందితోపాటు టిడిపి కార్యకర్తలను కలుపుకొని గ్రామ పంచాయితీ లోని అర్హులు గల ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ముండ్ల నరసింహారెడ్డి, నరసింహాచారి లు మాట్లాడుతూ, గ్రామంలోని అవ్వాతాతలు, వితంతువులు అలాగే వైకల్యం కలిగి ఉన్నవారిని కలిసి ఆప్యాయంగా పలకరించి వారికి యోగక్షేమాలు తెలుసుకొని పెన్షన్ అందిస్తుంటే, వారు పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనివని వారు తెలిపారు. ప్రతి అవ్వ తాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారు అభినందిస్తూ ఆశీర్వదిస్తుంటే ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అనురాగం వెలకట్టలేనివని వారు తెలియజేశారు. నేరుగా తమ ఇంటి వద్దకే స్వయంగా అధికారులు, డిపి నాయకులు వచ్చి పింఛన్ అందజేయడంతో లబ్ధిదారులు ఉబ్బితబ్బివడంతో పాటు… ప్రభుత్వం తమకు భరోసాగా నిలుస్తోందని, పింఛన్ సొమ్ముతో గౌరవప్రదమైన జీవితాన్ని పొందగలుగుతామని, ఇది మంచి ప్రభుత్వమని తమసంతోషాన్ని వ్యక్తం చేశారని వారు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పింఛను మొత్తాన్ని పెంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, బలహీనులు, వితంతువులు అంగ వైకల్యం కలిగిన వారి కష్టాలను తీర్చి, గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తోందని వారు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమ లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి ఏప్రిల్ 2024 నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్నదని., అలాగే దివ్యాంగులకు రూ.6 వేలకు కు పెంచారని, పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ 15 వేలు పింఛను, కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛను ప్రభుత్వం అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

About Author