గోవిందమ్మకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం
1 min readశాంతి యుతంగా రిలే నిరాహార దీక్ష ప్రారంభం
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక సోమప్ప సర్కిల్ నందు గోవిందమ్మ కు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని ప్రజా సంఘ నాయకులు బి ఎస్. ఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ అమరేష్ , బీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న, ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల రంగన్న అలియాస్ నేపాల్ , నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు చార్లెస్, ప్రసన్న, మాల మహానాడు నాయకులు గడ్డం హుసేని, నర్సప్ప, మధుబాబు, సమతా సైనిక్ దళ్ రాయలసీమ నాయకులు సి.రంగయ్య , బీఎస్పీ పార్టీ నాయకులు సామెల్, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ మహిళ నాయకురాలు బతుకమ్మ నాయకులు అన్నారు. ముందుగా సోమప్ప సర్కిల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించి , సోమప్ప సర్కిల్లో రిలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కల్లుకుంట గ్రామంలో గోవిందం పై జరిగిన సంఘటనపై రాష్ట్ర నాయకులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్, హోం మినిస్టర్, మానవ హక్కుల కమిషన్ లు వచ్చేంతవరకు పోరాడతామని డిమాండ్ చేశారు. గోవిందమ్మ న్యాయం జరగడం కోసం మా ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. అధికారులు ప్రోత్సహించిన వాళ్లపై కేసులు కచ్చితంగా కట్టాలని, చార్ సీట్లో మిగిలిన వారిని చేర్చి అరెస్టు చేసేంతవరకు శాంతియుతంగా పోరాటం చేస్తామని తెలియజేశారు. లేనిపక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.