పంచాయితీ రాజ్ వనరుల ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం
1 min readప్రభుత్వ సంక్షేమాల పై పూర్తిస్థాయిలో శిక్షణ
వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గ్రామాలలో స్థానిక ప్రజా ప్రతినిధులకు పరిపాలనలో పూర్తి స్థాయిలో అవగాహనా కల్పించాల్సిన బాధ్యత శిక్షకులపై ఉందని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ తెలిపారు. ఏలూరులోని జిల్లా పంచాయతీ రాజ్ వనరుల శిక్షణ కేంద్రంలో ట్రైనిలకు (శిక్షకులు) శిక్షణ కార్యక్రమంను చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ట్రైనిలను ఉదేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలానే లక్ష్యంతో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు శిక్షణ కార్యక్రమన్ని ఏర్పాటు చేసింది అన్నారు. వార్సిక కార్యాచరణ ప్రణాళిక 24-2025 ప్రకారం గ్రామ పంచాయతీలలో పది అంశాలపై శిక్షణ నిర్వహించలని నిర్ణంచడం జరిగింది అన్నారు. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలలో సాధారణ కనీసం పరిపాలన విధానం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ముఖ్య నిబంధనలు, పారిశుధ్యం వ్యర్థల నిర్వహణ, త్రాగునిటీ సరఫరా, లేఔట్ బిల్డింగ్ ప్లాన్ నిబంధనలు గ్రామ పంచాయతీ ఆస్తులు, విధి దీపాలు, విధ్యుత్ బిల్లుల నిర్వహణ, ఆర్ధిక నిర్వహణ న్యాయ పరమైన అంశాలపై అవగాహనా ప్రభుత్వం సంక్షేమ పథకాలు వంటి వాటిపై పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు శిక్షణ అందించలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ భీమేశ్వర్, డిఆర్డిఏ పిడి డాక్టర్ విజయరాజు, జిల్లా పరిషత్ శిక్షణ విభాగ కో-ఆర్డినేటర్ గుర్రాల ప్రసంగరాజు, తదితరులు పాల్గొన్నారు.