తర్తూరు లో శనగ విత్తనాలు పంపిణీ..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూరు గ్రామంలో గురువారం ఉదయం గ్రామ టిడిపి నాయకులు సీఎం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు రైతులకు విత్తనాలను పంపిణీ చేసినట్లు గ్రామంలోని 71 మంది రైతులకు 20 కేజీల ప్యాకెట్లు 131 శనగ విత్తనాల క్వింటాళ్లు రైతులకు రామ్మోహన్ రెడ్డి మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు సౌమ్య పంపిణీ చేశారు.కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలను పంపిణీ చేస్తుందని వీటిని గ్రామస్తులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని అంతే కాకుండా మిగిలిన రైతులకు ఈరోజు (శుక్రవారం)కూడా రైతులకు విత్తనాలను అందజేస్తామని టిడీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, కరువ శేషన్న,షుకూర్,జి భాస్కర్ రెడ్డి,కరువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.