ఆక్యుపంక్చర్ వైద్యమునకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: ఆక్యుపంక్చర్ వైద్యమునకుస్వతంత్ర ప్రతిపత్తి గల వైద్యంగా గుర్తించిందని వ్యవస్థాపకులు, ఎస్పా భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి మాకాల సత్యనారాయణ తెలిపారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్యుపంక్చర్ స్వతంత్ర ప్రతిపత్తి గల వైద్యంగా గుర్తిస్తూ తేదీ సెప్టెంబర్ 26వ తేదీ 2024 న గెజిట్ నోట్ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏస్పా భారత్ ( ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ )హర్షం వ్యక్తం చేసింది.ఈ కార్యక్రమంలో , వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పాల్గొన్న ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా , మరియు మాజీ ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద యశోద నాయక్ కు ,ధన్యవాదాలు తెలిపారు..ఆక్యుపంక్చర్ గుర్తింపు కొరకు పార్లమెంటులో ప్రస్తావించి గుర్తింపు ఇవ్వవలసినదిగా కోరి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం దొరికేలా చేసిన అమలాపురం పార్లమెంటు సభ్యుడు పి. రవీంద్ర బాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి లోక్ సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ళ నారాయణ అప్పటి కేంద్ర మంత్రి సుజన చౌదరి కు సహకారం అందించిన వారందరికీ భారత అక్యుపంచరిస్టులు, ప్రజలు , రుణపడి ఉంటారని తెలిపారు . ఎస్పా భారత్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు సమాచారం కేంద్రానికి అందించి ఆక్యుపంక్చర్ గుర్తింపు సహకారం అందించినందుకు చీప్ ప్రిన్సిపల్ సెక్రటరీ సి ఎం టి కృష్ణ బాబు కి ,ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలిపారు .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo రాష్ట్రంలో ఆరోగ్య అభివృద్ధికి ఆక్యుపంక్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేసి విద్యను అందించడానికి కాలేజీలు మరియు ఆక్యుపంక్చర్ పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానించడం అయినది .ఈ కార్యక్రమంలో, ఎస్పా భారత్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అలవాల రవి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ కాశీ మహంతి సునీత, ఎం శివకుమార్ ,ఆర్య రాజకుమారి, జాయింట్ సెక్రటరీ గాండ్ల పుష్పలత ,నారగాని ప్రసాద్ , అశ్రఫ్ ఉన్నేసా , భూతపాటి ఉదయ్ కుమార్, S. చెన్నప్పారావు, కొండవీటి సుమతి , కానూరి విజయలక్ష్మి , ఆవుల వెంకటనారాయణ రెడ్డి , తౌ షిప్ , ఆక్యుపంక్చర్ థెరపీ కమిటీ సభ్యులుతదితరులుపాల్గొన్నారు.