బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓ..ఈఓఆర్డి
1 min readమిడుతూరు మండల పరిషత్ లో బదిలీలు..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు నూతన ఎంపీడీఓ గా టి దశరథ రామయ్య శుక్రవారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు.ఈయన నందవరం మండలంలో పనిచేస్తూ ఇక్కడికి సాధారణ బదిలీల్లో భాగంగా వచ్చారు.గతంలో కార్యాలయ పరిపాలన అధికారి (ఏఓ)గా 5 సంవత్సరాల పాటు పని చేస్తూ నందవరం మండలానికి పదోన్నతిపై ఎంపీడీవో గా వెళ్లారు.తిరిగి మళ్లీ ఇక్కడికి ఎంపీడీవో గా వచ్చారు.ఇక్కడ ఉన్న ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి గురువారం రిలీవ్ అయి కల్లూరు మండలానికి బదిలీపై వెళ్లారు.అదే విధంగా నూతన ఈఓఆర్డి గా వి.సంజన్న బాధ్యతలు చేపట్టారు.ఈయనచిప్పగిరి నుండి ఇక్కడకు వచ్చారు.నందికొట్కూరులో పంచాయతీరాజ్ ఏఈ గా ఉన్న జి ప్రతాప రెడ్డి ఇక్కడ విధుల్లో చేరారు.నూతన ఎంపీడీవోను కార్యాలయ ఏవో సురేష్ కుమార్,సీనియర్ అసిస్టెంట్ సురేష్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది ఎంపీడీవో కు పుష్ప గుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ ఉన్న ఈఓఆర్డి ఫక్రుద్దీన్ డోన్ కు బదిలీ అయ్యారు. మండల పరిషత్ లో సీనియర్ అసిస్టెంట్ గా అసిస్టెంట్ గా ఉన్న జి సురేష్ కుమార్ బదిలీపై వెళ్తున్నారు.ఈ స్థానంలో శ్రీరాములు వస్తున్నట్లు ఎంపీడీవో దశరథ రామయ్య తెలిపారు. గ్రామాలకు నూతన పంచాయితీ కార్యదర్శులు: శామీర్ 80 బన్నూరు నుండి చెరుకుచెర్ల కు,సుగుణావతి బేతంచెర్ల నుండి రోళ్ళపాడుకు,జలకనూరుకు షఫీ అహ్మద్,,పి పవన్ కుమార్ నాగలూటి కి,మిడుతూరు-2 ఎన్ అనురాధ పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు.ఇతర మండలాలకు బదిలీ:సుధీర్ పెసరవాయి కి,హసీనా ఖానం పూడూరు,శాలుభాష పారుమంచాల,విజయ కుమారి పాణ్యం కు బదిలీ అయ్యారు.తలముడిపి కి గోపీనాథ్ ను నియమించారు. వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు.