రైతులకు విత్తనాలను పంపిణీ చేసిన కాతా బ్రదర్స్..
1 min readగౌరు వెంకటరెడ్డిని కలిసిన రమేష్ రెడ్డి..రాజశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు(నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో రైతు సేవా కేంద్రంలో శుక్రవారం ఉదయం సబ్సిడీ శనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని టిడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా కాతా రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసే సబ్సిడీ శనగ విత్తనాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రైతులు సకాలంలో పంట పొలాల్లో విత్తనాలు వేయుటకు గాను ప్రభుత్వం సరైన సమయంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని అంతేకాకుండా ప్రభుత్వం అందజేసే ప్రతి పథకాన్ని రైతులు ఉపయోగించుకొని తమ జీవన అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.62 మంది రైతులకు గాను మొత్తం 4 వందల శనగ సంచులను పంపిణీ చేశామని ఆయన తెలిపారు.మిగిలిన రైతులకు ఈరోజు శనివారం రోజున కూడా విత్తనాలను అందజేయడం జరుగుతుందని అన్నారు.తర్వాత కాతా రమేష్ రెడ్డి,గుండం హరి సర్వోత్తమ్ రెడ్డి మరియు కాతా విష్ణువర్ధన్ రెడ్డి,గ్రామ వ్యవసాయ సహాయకులు అశోక్ విత్తనాలను పంపిణీ చేశారు.అదేవిధంగా మధ్యాహ్నం నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి ని కర్నూలు లోని ఆయన స్వగృహంలో ఖాతా రమేష్ రెడ్డి మరియు కమతం జనార్దన్ రెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి కలసి మండల అభివృద్ధి గురించి మరియు పలు విషయాల గురించి ఆయనతో చర్చించారు.ఈ కార్యక్రమంలో మౌలాలి,మునాఫ్,మాజీ ఎంపీటీసీ నారాయణ,గోవిందు, ఇస్మాయిల్,పుల్లయ్య,గోకారి, చాంద్ బాష మరియు రైతులు పాల్గొన్నారు.