రైతులకు డీలర్లు అవసరమైన ఎరువులు మందులు మాత్రమే ఇవ్వాలి
1 min readఅనవసరమైన ఎరువులు కట్టబెడితే చర్యలు తప్పవు
ఎరువులు మందుల షాపులను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రైతులకు అవసరమైన ఎరువులు మందులు ఇవ్వాలని అలా కాకుండా వాటికి జతగా వేరొక ఎరువులను కానీ, మందులను కానీ ఇచ్చి ఇబ్బంది పెట్టినచో అలాంటి డీలర్ల పై చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి ఎరువులు మందుల డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం ఆమె మండలంలోని ఎరువులు పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె డీలర్లతో మాట్లాడుతూ అనుమతి లేని ( బ్యాన్) నిషేధించిన మందులను అమ్మ రాదని డీలర్లకు తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను మాత్రమే ఇవ్వాలని ఒకటి కావాలంటే దానికి జతగా వేరొకటి తీసుకోవాలని రైతులను ఇబ్బంది పెట్టినచో అటువంటి డీలర్ల పై చర్యలు తీసుకోబడతాయని ఆమె డీలర్లను హెచ్చరించడం జరిగింది. రైతులు తాము కొనుగోలు చేసిన ఎరువులు, పురుగు మందులకు సంబంధించి తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని తెలియజేశారు. అదేవిధంగా డీలర్లు అందరూ ధరలపట్టికనురిజిస్టర్లనుఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలియజేయడం జరిగింది.