రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలసకు పోతుంటారు. చదువుకునే పిల్లల్ని తీసుకుపోవడం వల్ల వాళ్ళ విద్యాభ్యాసం ఇరకాటంలో ఉంది. వీరి కోసం వీరి పిల్లల కోసం చదువు పాడవకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయాలని – కస్తూరిబా స్కూల్స్ , AP మోడల్ స్కూల్స్ , అలాగే జ్యోతి రావ్ పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసిందిగా విన్నవించాను. అదే సందర్భంలో వాల్మీకి కులస్తులని ఎస్టీ జాబితాలో చేర్చడం , మాదాసి కురవలకు ఎస్సీ సర్టిఫికెట్ల మీద ప్రత్యేకంగా చర్చించాను .. వినతి పత్రం కూడా ఇచ్చాను. పై అన్ని విషయాలపై తప్పక తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.