డీఎస్ఓ గా బాధ్యతలు స్వీకరించిన రాజా రఘువీర్
1 min readకర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో పని చేస్తున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు బదిలీ కావడంతో ..వారి స్థానంలో శుక్రవారం కొందరు బాధ్యతలు స్వీకరించారు. సివిల్ సప్లై జిల్లా అధికారిగా డిప్యూటీ డైరెక్టర్ రాజా రఘువీర్ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలో పని చేస్తున్న రాజా రఘువీర్ ఇక్కడికి డిప్యూటేషన్ పై రాగా.. ఇక్కడ పని చేస్తున్న ప్రసాద్ రాజమండ్రికి బదిలీపై వెళ్లారు. అంతకు ముందు కలెక్టర్ రంజిత్ బాషను , జాయింట్ కలెక్టర్ బి. నవ్య ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా రాజారఘువీర్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇన్చార్జ్ డీఎస్ డీఓగా పని చేశానని, జిల్లాలో పౌర సరఫరాల శాఖ అధికారుల సమన్వయంతో విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూస్తానన్నారు.
డీఆర్ డీఏ ఇన్చార్జ్ పీడీగా నాగశివలీల
డీఆర్ డీఏ ఇన్చార్జ్ పీడీగా నాగశివలీల శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న పీడీ సలీంబాష శుక్రవారం మధ్యాహ్నం రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం మెప్మా పీడీగా విధులు నిర్వర్తిస్తున్న నాగశివలీల… శుక్రవారం సాయంత్రం డీఆర్ డీఏ ఇన్చార్జ్ పీడీగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా డీఆర్ డీఏ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా తన వంతు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఆర్ డీఏ ఇన్చార్జ్ పీడీ నాగ శివలీల ఈ సందర్భంగా స్పష్టం చేశారు.