PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాలక్ష్మిదేవిగా దర్శనమిచ్చిన మహాగౌరీ అమ్మవారు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి సందర్బంగా  శుక్రవారం ప్రాతఃకాలంలో మహాగౌరీ అమ్మవారికి విశేష అభిషేకము, అర్చనలు జరిగినవి. మహా గౌరీ అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరించి,  మంటపారాధన దేవి ఖడ్గమాల లలితా సహస్రనామాలతో అర్చన చేశారు. ఈ సందర్భంగా రాహుకాల పూజ నిర్వహించడం జరిగినది. అనంతరం నవ చండి హోమం భాగంగా చండీహోమం జరిగినది. ఇందులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు ప్రసాదం అందజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *