మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోండి
1 min read(ఆత్మకూరు డివిజన్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ కిషోర్ కుమార్)
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ప్రైవేట్ ప్రభుత్వ నూతన పాలసీ2024-26 సంబంధించిన వివరాలను సీఐ కిషోర్ కుమార్ పాత్రికేయులకు వివరించారు. ఆత్మకూరు డివిజన్లోని ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 4 మద్యం దుకాణాలకు. రూరల్ పరిధిలో 2 మద్యం దుకాణాలకు. కొత్తపల్లి మండలం లో 1 మద్యం దుకాణానికి. పాములపాడు మండలంలో 1 మద్యం దుకాణానికి. శ్రీశైలం మండలంలో 2 మద్యం దుకాణాలకు. వెలుగోడు మండలంలో 3 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రవేటు వ్యక్తులకు కేటాయిస్తుందన్నారు. మద్యం దరఖాస్తు చేసుకునే 2 లక్షల రూపాయల డీడీలు తీయవలసి ఉంటుందన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంటాయని మద్యం దుకాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు పూర్తి సమాచారం కోసం తమ కార్యాలను సంప్రదించాలని ఆయన అన్నారు. ఈనెల తొమ్మిదో తేదీ లోపు టెండర్ ప్రక్రియ జరుగుతుంది అని 11వ తేదీ నుండి టెండర్లు గెలుపొందిన వారికి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందని ఎక్సైజ్ సీఐ కిషోర్ కుమార్ వివరించడం జరిగింది.