PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక… జిల్లా కలెక్టర్​

1 min read

ప్రజాభిప్రాయం తో ప్రణాళిక రూపకల్పన

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా ఐదేళ్లకు స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందని, వివిధ వర్గాల ప్రజల నుండి అభిప్రాయాలను స్వీకరించి ఇందులో  పొందుపరచి ప్రభుత్వానికి పంపుతామని క జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర@2047 జిల్లా దార్శనిక ప్రణాళిక (2024-29) రూపకల్పన నిమిత్తం వివిధ వర్గాలు, అసోసియేషన్ లతో సమావేశమై వారి సలహాలు, సూచనలను స్వీకరించారు.  ఈ సందర్భంగా   స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక గురించి కలెక్టర్ వివరించారు.  2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి కానున్న సందర్భంగా అన్ని రంగాల్లో   రాష్ర్ట సమగ్రాభివృద్ధి ధ్యేయంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందన్నారు.. ఇందులో భాగంగా ఐదేళ్ళ కాలంలో అభివృద్ధి లక్ష్యాలతో  గ్రామ,మండల, జిల్లా   విజన్ ప్రణాళికలను రూపకల్పన చేస్తున్నామన్నారు.. జిల్లా స్థాయిలో ప్రణాళికల రూపకల్పనకు వివిధ వర్గాల ప్రజలు, అసోసియేషన్ల నుండి సలహాలు స్వీకరించడం జరుగుతోందన్నారు.ప్రధానంగా  వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధిపై దృష్టి సారించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ రంగాలతో పాటు విద్యా, వైద్య రంగాల్లో కూడా  అభివృద్ధి సాధించే విధంగా ప్రణాళికను రూపకల్పన చేసి దానిని అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. 2022-23 ధరల్లో కర్నూలు జిల్లా  జిడిడిపి 47514  కోట్లతో రాష్ట్రంలో 14వ స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు.. జీవీఏ కి సంబంధించి జిల్లా  వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 17447 కోట్లతో  39.11%, సేవా రంగాల్లో 17180 కోట్లతో 38.52%,  పారిశ్రామిక రంగంలో 9978 కోట్లతో 22.37%తో ఉందని కలెక్టర్ వివరించారు. వ్యవసాయ రంగంలో 10వ స్థానంలో, సేవా రంగంలో 12వ స్థానంలో, పారిశ్రామిక రంగంలో 13వ స్థానంలో ఉందని తెలిపారు. జిల్లా తలసరి ఆదాయం రూ.1,74,932 లతో రాష్ట్రంలో 19వ స్థానంలో ఉందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి సంబంధించి 7.97 లక్షల హెక్టార్ల జియోగ్రాఫికల్ ఏరియా ఉందని, ఇందులో 4.88 లక్షల హెక్టార్లు నికర విస్తీర్ణం కాగా, 1.06 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నీటిపారుదల రంగం లో ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా  గ్రోత్ ఇంజన్ లో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడ పై దృష్టి పెట్టడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 4470 ఎకరాల్లో ఓర్వకల్లు  పారిశ్రామిక కారిడార్ ఏర్పాటును ప్రకటించిందన్నారు.  దీంతోపాటు మిగిలిన 5వేల ఎకరాల్లో  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు..జిల్లాలో మైనింగ్, క్వారీయింగ్ రంగాల్లో అభివృద్ధికి అవకాశం ఉందని, అలాగే  మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలతో పాటుజిల్లా అన్ని రంగాల్లో మరింత వృద్ధి చెందే విధంగా ప్రణాళికను రూపొందించి, అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు తమ  సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు.రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర @2047 జిల్లా  విజన్ ప్రణాళికలో భాగంగా జిల్లాలో  నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.. గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులతో పాటు  తుంగభద్ర నీరు ఓవర్ ఫ్లో అయినప్పుడు, వాటిని వాడుకునేందుకు   తగిన నీటి నిల్వ వనరులు, నీటి సంరక్షణనిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.. అలాగే జిల్లాలో హార్టికల్చర్ ను పెంపొందించాలని సూచించారు.. ఉల్లి పంటను నిల్వ చేసుకునేందుకు గోడౌన్ లు, టమోటా మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు… అదే విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని,  పరిశ్రమలకు సంబంధించి స్మాల్ ఎంఎస్ ఎంఈలు, అగ్రి ప్రాడక్ట్స్ ప్రాసెసింగ్ చేసే మైక్రో యూనిట్లు ఎక్కువగా తీసుకురావాలని సూచించారు..రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ హాస్టల్లో వసతులను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పాఠశాలల్లో శ్రమదానం చేసే సంస్కృతి రావాలని సూచించారు.. మైనారిటీల అభివృద్ధికి మరింత కృషి జరగాలని, సంతోష సూచిక, ఆరోగ్య సూచికలు వృద్ధి పొందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు తమ సూచనలు, సలహాలను ఇచ్చారు.. జిల్లాలో ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను నిర్మించాలని, చెక్ డ్యాములు ఏర్పాటు చేయాలని, పరిశ్రమలను స్థాపించాలని సూచించారు.. వ్యవసాయ,అనుబంధ రంగాలను  అభివృద్ధి చేయాలని, ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 200 కు పెంచాలని, ఆదోని, ఎమ్మిగనూరులో టెక్స్టైల్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ,పత్తికొండ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టాలని కేంద్ర విద్యా సంస్థలను తీసుకురావాలని, కర్నూలు జనరల్ హాస్పిటల్ ను ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని సూచించారు.. నిర్మాణ రంగంలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలక్ట్రానిక్, ఐటి ఇండస్ట్రీస్ తీసుకురావాలని, ఆదోని ప్రాంతంలో జీన్స్ పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేయాలని, విజయవాడకు రైల్వే కనెక్టివిటీ పెంచాలని, కోడుమూరు ఎమ్మిగనూరు జాతీయ రహదారిగా మార్చాలని సూచించారు.. పీహెచ్సీలు సబ్ సెంటర్లలో 24 గంటలు డాక్టర్లు పనిచేసేలా చూడాలని, పశ్చిమ ప్రాంతంలో రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, తుంగభద్ర,హంద్రీ  నదులను అనుసంధానం చేయాలని, చెరువులకు నీటిని లిఫ్ట్ చేయాలని, భూసార పరీక్షలను చేయాలని, ఉల్లి మార్కెట్ను విస్తరించాలని, సబ్సిడీ ద్వారా టార్పాలిన్ లను ఇవ్వాలని, కృషి విజ్ఞాన కేంద్రం సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని, ఇన్సూరెన్స్ పై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని సమావేశంలో పలువురు సూచనలు చేశారు..సమావేశంలో స్వీకరించిన సూచనలను, సలహాలను ప్రణాళికలో రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ పేర్కొన్నారు.సమావేశంలో కలెక్టర్ చల్లా కళ్యాణి,  సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, వివిధ వర్గాలు, సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *