దేవరగట్టు బన్ని ఉత్సవం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి – జిల్లా ఎస్పీ
1 min readబన్నీ ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టభద్రత .
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ నెల 12 న జరుగబోయే దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ అన్నారు. ఈ సంధర్బంగా హోళగుంద మండలం, దేవరగట్టు లో బన్ని ఉత్సవ ఏర్పాట్ల పై శనివారం సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ..అక్టోబర్ 12 వ తేది దసర ఉత్సవాలలో దేవరగట్టులో జరిగే శ్రీ మాల మల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవం కు సంబంధించి పటిష్టభద్రత, బందోబస్తు ఏర్పాట్ల పై ఈ రోజు దేవరగట్టు కు రావడం జరిగిందన్నారు. బన్ని ఉత్సవం కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరూ గాయపడడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరగకుండా ప్రశాంత వాతావరణంలో బన్ని ఉత్సవం జరుపుకోవాలని దేవరగట్టు బన్ని ఉత్సవ భక్తులకు తెలియజేస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం ప్రశాంతవాతావరణంలో ఉత్సవం జరిగే విధంగా , చిన్న చిన్న సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. బన్ని ఉత్సవం ప్రశాంతవాతావరణంలో పూర్తి అయ్యే విధంగా పోలీసుయంత్రాంగం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.బన్నీ ఉత్సవ పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బన్ని ఉత్సవం సంధర్బంగా అక్రమ మద్యం సరఫరా , మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , జాయింట్ కలెక్టర్ డా. బి. నవ్య , ఆలూరు ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ , పత్తికొండ డిఎస్పి వెంకట్రామయ్య, ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ, సిఐలు ప్రసాధ్, కేశవరెడ్డి, శ్రీనివాస నాయక్, హోళగుంద ఎస్సై బాల నరసింహులు , ఆయా శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.