నేషనల్ హైవే కి సంబంధించిన రహదారులను వేగవంతంగా పూర్తి చేయండి
1 min readజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేషనల్ హైవే కి సంబంధించిన రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నేషనల్ హైవే రహదారుల పురోగతిపై నేషనల్ హైవే అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ హెచ్ 40 భూ సేకరణకి సంబంధించిన నష్ట పరిహారాన్ని వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్ హెచ్ 340సి కి సంబంధించి పసుపుల, రుద్రవరం గ్రామాలకు సంబంధించిన క్లెయిమ్స్ ను త్వరగా పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఎన్ హెచ్ 340 బి కి సంబంధించి సోమయాజులపల్లె నుండి డోన్ రూట్ కి సంబంధించిన క్లెయిమ్స్ ను, ఎన్ హెచ్ 167 కి సంబంధించి ఆదోని బైపాస్ క్లెయిమ్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు . అదే విధంగా మంత్రాలయం బైపాస్ కి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్ హెచ్ 340సి కి సంబంధించి బి. తాండ్రపాడు నుండి గార్గేయపురం వరకు జరుగుతున్న ఔటర్ రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15 తేది నాటికి పూర్తి చేయాలన్నారు. అదే విధంగా గార్గేయపురం గ్రామానికి సంబంధించి మిస్సింగ్ ఎక్సటెన్ట్ ఆఫ్ 3డి ని కాలా అధికారులు ఎన్హెచ్ వారికి హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైని కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, కర్నూలు ఆర్డీఓ సందీప్ , మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.