దసరా కానుకగా ఐ ఆర్ ప్రకటించాలి: ఆప్టా
1 min readపల్లెవెలుగు వెబ్ అమరావతి: ఈ 12 వ తారీకు దసరా సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐ ఆర్ ప్రకటించి పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేసి తీపి కబురు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ జి ఎస్ గణపతి రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పి ఆర్ సి లో ఎంతో అన్యాయం చేసిందని అలాగే డమ్మీ పిఆర్సి కమిషన్ వేసి మోసం చేసిందని వారు దుయ్యబట్టారు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 12వ పే రివిజన్ కమిషన్ వేసి ఐ ఆర్ ను ప్రకటించి మన ప్రభుత్వం ఉపాద్యాయ మరియు ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వమని నిరూపించుకుంటారని వారు ఆశాభావం వ్యక్తపరిచారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇవ్వవలసినటువంటి సరెండర్ లీవ్ బకాయిలను 2022 మే నుంచి పెండింగ్లో పెట్టిందని తక్షణమే ముఖ్య మంత్రి వర్యులు ఉపాధ్యాయ ఉద్యోగులకు సి ఎఫ్ ఎం ఎస్ లో అప్రూవ్ అయి పెండింగ్ లో వున్నటువంటి చెల్లింపులన్నిటిని ఉద్యోగులకు దసరా కానుక చెల్లించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన 12 డిఏలు పెండింగ్లో ఉన్నాయని వాటిలో కొన్ని అయినా ఇప్పుడు ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది.ప్రభుత్వము ఏర్పడి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల విషయం లో తీసుకోవలసిన చర్యలు వేగవంతం చేయ వలసి వుందని కోరారు.