మీ రక్షణే మా బాధ్యత ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం
1 min readసెలవులలో దూరప్రాంతాలకు ఊరు వెళితే తగు జాగ్రత్తలు తప్పనిసరి
లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం(LHMS) వినియోగించుకోవాలి
జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్
సమాచార కంట్రోల్ రూమ్ నెంబర్:833295 9175 కి తెలియజేయాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : మీ రక్షణే మా బాధ్యతని జిల్లా పోలీసు యంత్రాంగం విన్నవించారు.దసరా మరియు దీపావళి పండుగ సెలవులలో ప్రజలు మీ యొక్క ఇంటి ని వదలి సొంత ఊర్లకు వెళితే సదరు సమాచారాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అందించిన ఎడల రాత్రి గస్తీ సమయాలలో సదరు ఇంటిని పరిశీలనలో ఉంచుతామని సూచించారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ను (LHMS ) వినియోగించుకొని తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు, దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నరు. మీ యొక్క డబ్బులు బంగారం దొంగల బారిన పడకుండా ముద్దస్తగా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని సదరు CCTV లింకులు ఏలూరు కంట్రోల్ రూమ్ నెంబర్ 8332959175 కు వెంటనే అందించాలని అన్నారు.డబ్బు మరియు విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్ళకుండా. ఖరీదైన వస్తువులను బ్యాంక్ లాకర్ లో భద్రపరచుకోవాలని అనుమానంగా సంచరించే వారి గురించి, తాళం వేసిన ఇండ్ల వద్ద అపరిచిత వ్యక్తులు కనబడితే దగ్గర లో ఉన్న పోలీసు స్టేషన్ కు గాని డయల్ 112 కు వెంటనే సమాచారం అందించాలన్నరు.ఇంట్లో కుటుంబసభ్యులు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని ముందుగా పెద్దవారికి తెలియచేయాలని ఆదేశించారు.మీ యొక్క విలువైన వస్తువులను ఎదుటివారికి ఇచ్చి మోస పోవద్దు అని ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిది అని. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నరు.చుట్టు పక్కల వారి యొక్క సెల్ ఫోన్ నెంబరు లు మీ దగ్గర ఉంచుకోవాలి.గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.అదేవిధంగా పండుగ సందర్భంగా పెద్ద పెద్ద కంపెనీలు మంచి మంచి ఆఫర్లు ఇచ్చినందున ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు డూప్లికేట్ ఐడి క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తారు.అవసరం లేకుండా వచ్చే మెసేజ్ లలో బ్లూ కలర్ లింకులను ఓపెన్ చేయవద్దు అని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నరు. సైబర్ నేరానికి గురైన వారు వెంటనే 1930 కి కాల్ చేసిన యెడల మీకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రజలకు తెలియ చేశారు.