PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం దుకాణాలకు దరఖాస్తుకు చివరి తేదీ 9న సాయంత్రం ఐదు గంటల లోపు                  

1 min read

11వ తేదీన మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో వేలంపాటలు:- .రాముడు (నంద్యాల జిల్లా ఏఈఎస్).                             

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని, ప్రోహిబిషల్ & ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ లో, ఆత్మకూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ప్రైవేట్ -ప్రభుత్వ నూతన పాలసీ 2024-26 సంవత్సరాలకు సంబంధించిన వివరాలను నంద్యాల జిల్లా అడిషనల్ ఎక్సైజ్ సూపరెంటెండ్  రాముడు, సీఐ-ఎస్.కిషోర్ కుమార్, ఎస్సైలు ఎం.వీరస్వామి, పి.జగదీష్ లతో కలిసి  మీడియా విలేకరుల సమావేశంలో  జిల్లాకు 105 మద్యం షాపులని తెలియజేశారు.     ఈ సందర్భంగా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అడిషనల్ ఎక్సైజ్ సూపరెంటెండ్ వి. రాముడు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు 105 మద్యం షాపులకు  ఇప్పటివరకు దరఖాస్తులు  ఆఫ్ లైన్ లో దాదాపు 60 అప్లికేషన్లు, ఆన్లైన్లో 54 అప్లికేషన్లు వచ్చాయన్నారు.  మద్యం దుకాణాలు పాఠశాలలకు, మసీదులకు, దేవాలయాలకు, చర్చిలకు  100 మీటర్ల లోపు ఉండకూడదన్నారు. ఆత్మకూరు డివిజన్లోని ఐదు మండలాలలో 13 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో- 4 మద్యం దుకాణాలకు, రూరల్ పరిధిలో- 2 మద్యం దుకాణాలకు, కొత్తపల్లి మండలంలో- 1 మద్యం దుకాణానికి. పాములపాడు మండలంలో- 1 మద్యం దుకాణానికి, శ్రీశైలం మండలంలో- 2 మద్యం దుకాణాలకు, వెలుగోడు మండలంలో- 3 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రవేటు వ్యక్తులకు కేటాయిస్తుందన్నారు. ఈ మద్యం దుకాణాలకు ఎటువంటి రిజర్వేషన్లు లేవన్నారు. ప్రభుత్వానికి బకాయి పడినవారు కూడా ఉండకూడదు అన్నారు. అప్లికేషన్ ఫీజు బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా 2 లక్షల రూపాయల డీడీలు చెల్లించి, దరఖాస్తు ఫారం పూర్తి చేసి, ఆధార్ కార్డు, మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, మొబైల్ నెంబర్ తో సహా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ రెండు లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు  వాపసు ఇవ్వబడదు అన్నారు. దరఖాస్తు చేసుకునే వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని, లేదా ఆ విధంగా తెలియని వాళ్ళు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మా ఆత్మకూరు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో రెండు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు  అందుకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంటాయని మద్యం దుకాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు పూర్తి సమాచారం కోసం తమ కార్యాలయంను సంప్రదించాలని  అన్నారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు టెండర్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు,     11వ తేదీన  లాటరీ పద్ధతి ద్వారా(టెండర్లు) గెలుపొందిన వారికి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందని, అదే రోజు ఎంపిక అయినవారు 50 లక్షల రూపాయలు మొదటి కంతు(1/6)గా ప్రభుత్వ ఖజానాకు రెంటల్ చెల్లించవలసి ఉంటుందనీ  వివరించడం జరిగింది. మద్యం దుకాణాలలో గతంలో పనిచేసిన నిరుద్యోగులను ఇప్పుడు ఏమైనా తీసుకుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం వీరిపై సానుకూలంగా ఉందని, తీసుకుంటారో లేదో మాకు తెలియదు అన్నారు.                 ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *