రామనపల్లె కార్యదర్శిగా భాద్యతలు చేపట్టిన ఎం గురువేశ్వరరావు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని రామనపల్లె గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఎం గురువేశ్వరరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు, మైదుకూరు మండలం అన్నలూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గురువేశ్వరరావు రామనపల్లె గ్రామ కార్యదర్శిగా రావడం జరిగింది. అయితే గతంలో రామనపల్లి కార్యదర్శిగా కాగా విధులు నిర్వహిస్తు ఇక్కడి నుండి మైదుకూరు మండలం అన్నలూరు గ్రామ పంచాయతీకి బదిలీపై వెళ్లడం జరిగింది. తిరిగి ఆయన మళ్లీ రామనపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి గా ఇక్కడికి బదిలీపై రావడంతో రామనపల్లి గ్రామపంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించే సమయంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ ఏ సమస్యలు లేకుండా ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఆయన విధులు నిర్వహించేవారని ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి గురువేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిడీలు లేకుండా పని చేశానని, ఇక్కడి నుండి బదిలీపై వెళ్లేటప్పుడు సొంత గ్రామాన్ని వదిలి వెళ్ళినట్లు బాధపడ్డానని తిరిగి మళ్లీ ఇక్కడికే కార్యదర్శిగా రావడం జరిగిందన్నారు, గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.