PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూల్ సిటీ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షులుగా షేక్ జిలాని భాష

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా షేక్ జిలాని భాష పదవి బాధ్యతలు స్వీకరించారు సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కర్నూలు డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిలాని భాష నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ రికార్డులలో సంతకాలు చేసిన జిలాని భాష మాట్లాడుతూ నా మీద నమ్మకంతో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించిన ఎఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే కి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి కి నాకు సహకరించిన కర్నూలు, నంద్యాల డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ కి, జె లక్ష్మి నరసింహ యాదవ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలను చేపట్టి కర్నూలు నగరంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతి వార్డులో తిరిగి బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డులలో గెలిపిస్తానని జిలాని భాష హామీ ఇచ్చారు. అనంతరం కర్నూలు డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని కేంద్రంలో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ షర్మిలా రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యమని తెలియజేశారు. అనంతరం నంద్యాల డిసిసి అధ్యక్షులు జె లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జాన్ విల్సన్ కి వీడ్కోలు సన్మానం, నూతన అధ్యక్షులు జిలాని భాష కి స్వాగత సన్మానం చేయడమైనది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, ఎమ్మిగనూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్, ఏం ఖాసిం వలి, మంత్రాలయం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మురళీ కృష్ణంరాజు, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పీజీ నరసింహులు యాదవ్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎన్ సి బజారన్న, కే వెంకటరెడ్డి, కె సత్యనారాయణ గుప్త, పీజీ ప్రదీప్ యాదవ్, రియాజుద్దీన్, ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, షేక్ ఖాజా హుస్సేన్, ఖాద్రి పాష, అనంతరత్నం మాదిగ, ఈ లాజరస్, సయ్యద్ నవీద్, షేక్ మాలిక్ భాష, బి సుబ్రహ్మణ్యం, సాయికృష్ణ, అబ్దుల్ హై, వెల్దుర్తి శేషయ్య, గీతా ముఖర్జీ నగర్ రమేష్,  జాన్ సదానందం, అక్బర్ ఐఎన్టీయూసీ ఎన్ సుంకన్న, ఆర్ ప్రతాప్, అక్బర్, రంగస్వామి మహిళా కాంగ్రెస్, ఏ లలిత, హైమావతి, కరుణమ్మ, సావిత్రి, అయ్యమ్మ మద్దమ్మ, స్వప్న, సలోమి మొదలగు వారు పాల్గొన్నారు.

About Author