పరిహారం అందని బాధితులకు నగదు పంపిణీ
1 min readజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: గత ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం అందించామని సాంకేతిక కారణాలవల్ల పరిహారం అందని బాధితులకు నగదు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. సోమవారం కలెక్టర్ లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో భాగంగా నష్టపరిహారం అందని పదిమంది బాధితులకు లక్ష రూపాయల నగదును బాధితులకు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అధిక వర్షాల దెబ్బతిన్న పంటలు, గృహాలు, పశుసంపద బాధితుల పరిహారానికి సంబంధించి బ్యాంక్ ఖాతాలో ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో నిధులు జమ కాని 10 మంది బాధితులకు నగదు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందని బాధితుల అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని సంబంధిత మొత్తాలను కలెక్టర్ల అకౌంట్ లలోకి జమ చేసి నష్టపరిహారం అందని బాధితులకు అందజేయాలని ఆదేశించిందన్నారు. ఈ మేరకు అధిక వర్షాలకు దెబ్బతిన్న 331 గృహా బాధితులకు గాను 321 మంది ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని మిగిలిన 10 మంది బాధితులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున లక్ష రూపాయలు నగదు మొత్తాలను పంపిణీ చేశామని కలెక్టర్ వివరించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ ఎ పద్మజ తదితరులు పాల్గొన్నారు.